‘కన్నడ నాట ఇక సుస్థిర సర్కార్‌’

Yediyurappa Welcomes Karnataka Assembly Bypoll Results - Sakshi

బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నానని సీఎం బీఎస్‌ యడియూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో ఇప్పుడు తమకు ఎలాంటి సమస్యలూ లేవనీ, ఇక ప్రజా అనుకూల, సుస్ధిర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆరు స్ధానాలను ఇప్పటికే కాషాయపార్టీ దక్కించుకోగా మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. విపక్ష కాంగ్రెస్‌ కేవలం రెండు స్ధానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాగా, ఉప ఎన్నికల్లో కాషాయ ప్రభంజనంతో కన్నడ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం సమసిపోయినట్టయింది. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు  ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. యడ్డీ సర్కార్‌ మనుగడ కోసం ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధించాల్సి ఉండగా అంతకుమించిన సీట్లు కాషాయ ఖాతాలో పడనుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top