బడ్జెట్‌కు కేం‍ద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ | Union Cabinet Cleared Nirmalas Budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌కు కేం‍ద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

Jul 5 2019 10:38 AM | Updated on Jul 5 2019 11:37 AM

Union Cabinet Cleared Nirmalas Budget - Sakshi

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్‌ 2019కు శుక్రవారం ఉదయం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం పార్లమెంట్‌కు చేరుకున్న సీతారామన్‌ కేబినెట్‌ భేటీలో పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో ఉదయం 11 గంటలకు ఆర్థిక మం‍త్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నరేంద్ర మోదీ సర్కార్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ కావడంతో ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement