ఆధార్‌ ‘అడ్రస్‌ మార్పు’నకు కొత్త సర్వీస్‌

UIDAI to bring new service for making address update in Aadhaar easy - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డులో సరైన అడ్రస్‌ లేని వారు తాము ప్రస్తుతం ఉంటున్న నివాసం అడ్రస్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు యూఐడీఏఐ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ సర్వీస్‌ అమల్లోకి వస్తుంది. ‘సరైన అడ్రస్‌ ప్రూఫ్‌ ఉన్న వాళ్లు ఆ వివరాలను ఆధార్‌ సెంటర్లో సమర్పించి చిరునామా మార్చుకోవచ్చు. లేని వారు ఆ అడ్రస్‌కు పంపే ‘రహస్య పిన్‌’ను ఆధార్‌ కేంద్రంలో లేదా ఎస్‌ఎస్‌యూపీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరిచి చిరునామా మార్చుకోవచ్చు’ అని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్‌లో సరైన అడ్రస్‌ లేనందున వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త సర్వీసు ఆధారంగా ఈ సమస్యకు వీలైనంత పరిష్కారం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జనవరి 1, 2019 నుంచి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top