జాతీయ సమైక్యతా దినంపై వివాదం! | The controversy on National Integration Day! | Sakshi
Sakshi News home page

జాతీయ సమైక్యతా దినంపై వివాదం!

Oct 23 2014 2:37 AM | Updated on Sep 2 2017 3:15 PM

ఉక్కుమనిషి, దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పటేల్ జయంతిని సమైక్యతా దినంగా ప్రకటించిన కేంద్రం
ఇప్పటికే ఇందిర జయంతిని ఈ రోజుగా పాటిస్తున్న దేశం

 
న్యూఢిల్లీ/ముంబై: ఉక్కుమనిషి, దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19ని ఇప్పటికే జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారే అవకాశముంది. పటేల్ జయంతిని జాతీయ సమైక్యతా దినంగా(రాష్ట్రీయ ఏకతా దివస్)గా నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతముందు ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబైలో విలేకర్లతో మాట్లాడుతూ.. పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న  ‘జాతీయ సమైక్యతా పరుగు’ (రన్ ఫర్ యూనినిటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పటేల్ సందేశాన్ని ఘనంగా చాటేందుకే దీన్ని చేపడుతున్నామని, ఇందులో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొంటారని తె లిపారు.

‘సర్దార్ పటేల్ దేశానికి చేసిన నిరుపమానమైన సేవల గురించి నేటి సమాజానికి అవగాహన తక్కువే. ఇది చాలా దురదృష్టకరం. ఇటీవలే నేను పదో తరగతి చరిత్ర పుస్తకాన్ని చూశాను. అందులో పటేల్ ప్రస్తావనే ఒకే ఒక్కసారి ఉంది’ అని అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక 1947-1949 మధ్య పటేల్ 500 సంస్థానాలను దేశంలో విలీనం చేశారని, దీన్ని సంస్మరించుకునేందుకే జాతీయ సమైక్యతా దినం పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

  •  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement