అత్యాచారం కేసు.. అరుదైన తీర్పు | Thanjavur Court has Awarded A Double Life Term To A Man | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసు.. 2 సార్లు జీవిత ఖైదీగా శిక్ష

Oct 11 2018 7:11 PM | Updated on Oct 11 2018 7:41 PM

Thanjavur Court has Awarded A Double Life Term To A Man - Sakshi

చెన్నై : పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 64 ఏండ్ల వ్యక్తికి తంజావూరు కోర్టు రెండు సార్లు జీవిత ఖైదీగా శిక్ష విధిస్తూ అరుదైన తీర్పునిచ్చింది. అయితే ఈ అత్యాచార సంఘటన 2012లో జరిగింది. వివరాలు.. రామాయన్ అనే వ్యక్తి ఒరతనాడుకు చెందిన రైతు. 2012లో రామాయన్, ఓ 11ఏళ్ల బాలికకు మాయమాటలు ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ బాలికకు లైంగిక వ్యాధులు సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో పోక్సో యాక్ట్ కింద రామాయన్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసులో తంజావూరు మహిళా కోర్టు న్యాయమూర్తి బాలక్రిష్ణన్ నిందితుడికి రెండు సార్లు జీవిత ఖైదిగా శిక్ష విధించడంతో పాటు, రూ.2500 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement