పారా సెయిలింగ్‌ చేస్తుండగా తాడు తెగి.. | Teen dies while parasailing in Murud beach | Sakshi
Sakshi News home page

పారా సెయిలింగ్‌ చేస్తుండగా తాడు తెగి..

May 26 2019 12:09 PM | Updated on May 26 2019 12:17 PM

Teen dies while parasailing in Murud beach - Sakshi

సాక్షి ముంబై : ముంబైలోని మురూడ్‌లో పారా సెయిలింగ్‌ చేస్తుండగా తాడు తెగి ఓ 15 ఏళ్ల బాలుడు మరణించాడు. మరోవైపు ఆ బాలుని తండ్రికి గాయాలయ్యాయి. మురూడ్‌ సముద్ర తీరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పుణే కసబారోడ్డుపై నివసించే గణేష్‌ పవార్‌ కుటుంబీకులు అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లారు. సమీపంలో మురూడ్‌ తీరంలో పారా సేలింగ్‌ చేసేందుకు సిద్దమయ్యారు.

పారాచూట్‌ పైకి వెళ్లిన అనంతరం దాని తాడు తెగిపోవడంతో ఒక్కసారిగా గణేష్‌ పవార్‌తోపాటు ఆయన కుమారుడు వేదాంత్‌ పవార్‌ (15) ఇద్దరు చాలా ఎత్తు నుంచి కిందపడిపోయారు. దీంతో ఘటన స్థలంలోనే వేదాంత్‌ దుర్మరణం చెందాడు. మరోవైపు గణేష్‌ పవార్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement