నా భార్య వేధించింది.. విడాకులు ఇవ్వండి! | Tamil actor Krishna Kulasekaran files for divorce | Sakshi
Sakshi News home page

నా భార్య వేధించింది.. విడాకులు ఇవ్వండి!

Jul 2 2015 3:54 PM | Updated on Sep 3 2017 4:45 AM

నా భార్య వేధించింది.. విడాకులు ఇవ్వండి!

నా భార్య వేధించింది.. విడాకులు ఇవ్వండి!

తమిళ నటుడు కృష్ణ కులశేఖరన్, భార్య హేమలతల మధ్య వివాహ బంధం దాదాపు ముగింపు దశకు వచ్చింది.

చెన్నై: తమిళ నటుడు కృష్ణ కులశేఖరన్, భార్య హేమలతల వివాహ బంధం దాదాపు చెడిపోయింది. చాలాకాలం హేమలతతో ప్రేమాయణ నడిపి గత సంవత్సరం వివాహం చేసుకున్న కులశేఖరన్.. ఇక తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడు. ఈ మేరకు గురువారం విడాకులు కోరుతూ ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టును ఆశ్రయించాడు.  తనకు ఆమె నుంచి విడాకులు మంజూరు చేయాల్సిదింగా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నాడు. గతేడాది ఫిబ్రవరి 6 వ తేదీన పెళ్లి చేసుకున్న తమ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టం చేశాడు. పెళ్లైన తొలిరోజు నుంచే తనను భార్య వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిపాడు. అటు శారీరకంగాను,  మానసికంగాను భార్య తో వేధించబడినట్లు విడాకుల పత్రాల్లో తెలిపాడు.

 

తాను షూటింగ్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన సమయంలో భార్య తనను అనుమానంతో  వేధించేదని తెలిపాడు. అక్రమ సంబంధాలను అంటగడుతూ తనను చిత్రహింసలు పెట్టేదని.. ఆ క్రమంలోనే షూటింగ్స్ పై  ఏకాగ్రత పెట్టలేకపోయేవాడినని కోర్టుకు తెలిపాడు.  అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశానంటూ భార్య దాఖలు చేసిన పిటిషన్ లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement