వర్సిటీ క్యాంపస్‌లో వివేకానంద విగ్రహం ధ్వంసం

Swami Vivekananda Statue Vandalised At JNU - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహాన్నిదుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మిన్‌ బ్లాక్‌లోకి బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి వర్సిటీ వీసీ మామిడాల జగదీష్‌ కుమార్‌పై అభ్యంతరకర మెసేజ్‌లు రాసిన మరుసటి రోజు వివేకానంద విగ్రహం ధ్వంసం చేయడం గమనార్హం. విద్యార్ధుల ఆందోళనతో పెంచిన ఫీజులను జేఎన్‌యూ అధికారులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. హాస్టల్‌ ఫీజు పెంపు, డ్రెస్‌ కోడ్‌ వంటి పలు సమస్యలపై జేఎన్‌యూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చి పెంచిన ఫీజులను ఉపసంహరించినట్టు ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top