తమిళనాడులో ఇద్దరు ఏపీ విద్యార్థుల మృతి | svu students died in a road accident | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఇద్దరు ఏపీ విద్యార్థుల మృతి

Nov 2 2016 8:43 AM | Updated on Nov 9 2018 4:12 PM

రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు.

తిరుత్తణి(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల(ఎస్వీయూ)లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కారులో చెన్నైకి వెళుతున్నారు. ఈ క్రమంలో తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్దకు రాగానే కారు అదుపు తప్పి ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో సుదర్శన్, శివసాయికృష్ణ అనే వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను తిరుత్తణి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement