నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారేమో : సుమలత

Sumalatha Ambareesh Comments On Phone Tapping Case - Sakshi

మండ్య : ‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించడం మంచిదే,  దీనివల్ల ఎవరు ఏం చేశారు అన్న అన్ని నిజాలు బయటకి వస్తాయి. ట్యాపింగ్‌ కేసుపై తప్పకుండా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందే’ అని మండ్య ఎంపీ సుమలత అంబరీష్‌ అన్నారు. తన ఫోన్‌ కూడా ట్యాప్‌ అయ్యిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం మండ్య తాలుకాలోని పణకనహళ్ళి గ్రామంలో సుమలత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లను ట్యాప్‌ చేశారని ఆరోపించారు. దీనిపై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఎవరు ఎవరి ఫోన్లను ట్యాప్‌ చేశారో తప్పకుండా బయటకి వస్తుందని అన్నారు. నిజం వెలుగు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top