సునంద కేసులో అమర్సింగ్కు సిట్ పిలుపు | sit summons amar singh in sunanda pushkar murder case | Sakshi
Sakshi News home page

సునంద కేసులో అమర్సింగ్కు సిట్ పిలుపు

Jan 28 2015 3:07 PM | Updated on Sep 18 2019 3:04 PM

సునంద కేసులో అమర్సింగ్కు సిట్ పిలుపు - Sakshi

సునంద కేసులో అమర్సింగ్కు సిట్ పిలుపు

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించనుంది.

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనను పిలిపించింది. విచారణకు హాజరు కావాల్సిందిగా అమర్ సింగ్తో పాటు సునంద కుమారుడికి కూడా కబురు పంపింది.

సునంద హత్య కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ఆమె సన్నిహితులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో సునంద కొడుకు, అమర్ సింగ్లను ప్రశ్నించనున్నారు. ఐపీఎల్ వివాదంలో సునంద పేరు తెరపైకి వచ్చినపుడు అమర్ సింగ్ ఆమెను సమర్థించారు. అంతేగాక సునంద తనకు మంచి స్నేహితురాలని అప్పట్లో ఆయన చెప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అమర్ సింగ్ను విచారించనుంది. సునంద హత్య కేసులో భర్త శశి థరూర్తో పాటు ఆమె సన్నిహితురాలు నళినీ సింగ్లను ఇటీవల విచారించారు. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement