షిల్లాంగ్‌లో 15ఏళ్ల బాలిక దారుణ హత్య | Shillong brutal murder of 15-year-old girl | Sakshi
Sakshi News home page

షిల్లాంగ్‌లో 15ఏళ్ల బాలిక దారుణ హత్య

Oct 7 2014 12:24 AM | Updated on Sep 2 2017 2:26 PM

మేఘాలయులోని తూర్పుగారో హిల్స్ జిల్లాలో ఓ 15ఏళ్ల బాలిక దారుణ హత్యకుగురైంది.

న్యూఢిల్లీ: మేఘాలయులోని తూర్పుగారో హిల్స్ జిల్లాలో ఓ 15ఏళ్ల బాలిక దారుణ హత్యకుగురైంది. గుర్తుతెలియుని వ్యక్తులు ఆ బాలిక తలతోపాటు చేతులను కూడా నరికివేశారు. సోంగ్‌సక్‌రోడ్‌కు సమీపంలోని అడవిలో బాలిక మతదేహాన్ని కనుగొన్నట్టు సోమవారం పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాలి కపై అత్యాచారం జరిగినట్టు భావిస్తున్నారు. వారంకిందట కనిపించకుండా పోరుున బాలిక ఆదివారం రాత్రి శవమై కనిపించిందని జిల్లా ఎస్పీ డేవిస్ మరక్ తెలిపారు. చేతులు, తల ఒకచోట.. మొండెం మరోచోట దొరికాయని, వుృతదేహంలో అధికభాగాన్ని జంతువులు తినేశాయుని ఆయన చెప్పారు.  

 యుువతిపై సాముహిక అత్యాచారం: జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా, తొరాయ్ గ్రామం సమీపంలో పదిమంది వ్యక్తులు 20 ఏళ్ల యుువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి స్నేహితురాళ్లతో కలిసి ఈ గ్రామలో దుర్గాపూజ కార్యక్రమాలను చూసేందుకు వచ్చిన ఆ యుువతిని పదివుంది యుువకులు పట్టుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement