రేపు జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఎంపీల ధర్నా | seemandhra mp's to dharna at jantar mantar | Sakshi
Sakshi News home page

రేపు జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఎంపీల ధర్నా

Aug 12 2013 9:58 PM | Updated on Sep 1 2017 9:48 PM

రేపు జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమైయ్యారు.

ఢిల్లీ: రేపు జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమైయ్యారు. తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు ధర్నాకు దిగనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయం వేరు..ప్రభుత్వం నిర్ణయం వేరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చాలా స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు. ఆంటోని కమిటీ ముందు తమ వాదనలను వినిపిస్తామన్నారు. ఆహార భద్రత బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నామని హర్షకుమార్ తెలిపారు.
 
 రాష్ట్రం  సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు కాకినాడ ఎంపీ  పల్లంరాజు తెలిపారు.కాగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం నిరసన కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement