రాష్ట్రాల నిబంధనలకు ఢోకా ఉండదు | SC allays states’ concerns over centralised selection of subordinate court judges | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల నిబంధనలకు ఢోకా ఉండదు

Jul 11 2017 1:30 AM | Updated on Sep 2 2018 5:24 PM

సబార్డినేట్‌ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకం కోసం ప్రతిపాదిం చిన కేంద్రీకృత ఎంపిక

‘న్యాయాధికారుల’పై సుప్రీం
న్యూఢిల్లీ: సబార్డినేట్‌ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకం కోసం ప్రతిపాదిం చిన కేంద్రీకృత ఎంపిక యంత్రాంగం వల్ల సంబంధిత నియామకాల కోసం రాష్ట్రాలు అనుసరిస్తున్న నిబంధనలకు విఘాతం కలగదని సుప్రీం కోర్టు భరోసా ఇచ్చింది.

దేశవ్యాప్తంగా సబార్డినేట్‌ కోర్టు ల్లో క్రమం తప్పకుండా నియామకాలు జరిపేందుకు ఈ ప్రతిపాదన ముందుకొచ్చిందని చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని బెంచ్‌ సోమవారం పేర్కొంది. ‘ప్రస్తుతం ఒక అభ్యర్థి సంబంధిత రాష్ట్రం నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కేంద్రీకృత యంత్రాంగం వస్తే అభ్యర్థులు ఒకే నిబం« దనలున్న పలు రాష్ట్రాల పరీక్ష లకు దరఖాస్తు చేసుకోవచ్చు’ అని చెప్పిం ది. దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకో ర్టు, ఉత్తరాఖండ్, కేరళ, గుజరాత్‌ హైకో ర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement