ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు | Sakshi
Sakshi News home page

ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు

Published Tue, Aug 14 2018 2:33 AM

SC accepts Centre's proposal for use of coloured stickers ... - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్‌ స్టిక్కర్‌ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్, విద్యుత్‌లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్‌సీఆర్‌లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్‌తో నడిచే వాహనాలకు ఆరెంజ్‌ కలర్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాలకు గ్రీన్‌ నంబర్‌ ప్లేట్లను లేదా గ్రీన్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement