
అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు
ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మన దేశానికే సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మన దేశానికే సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ''అత్యాచారాల గురించి విన్నప్పుడల్లా మన తలలు సిగ్గుతో వంచుకోవాలి. తల్లిదండ్రులను ఇక్కడో ప్రశ్న అడగదలచుకున్నా.
మీ అమ్మాయి 10, 12 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమెకు ఎక్కడకు వెళ్తున్నావు, ఎప్పుడొస్తావు, వెళ్లగానే ఫోన్ చెయ్యి అని రకరకాలుగా చెబుతుంటాం, ప్రశ్నలు వేస్తాం. అదే మీ అబ్బాయి ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు అలా అడిగారా? ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నవాళ్లంతో ఎవరో ఒకళ్ల పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు వాళ్లను కూడా ఇలాగే ప్రశ్నిస్తే అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి'' అని మోడీ అన్నారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడు తల్లిదండ్రులు తమ అబ్బాయిలతో వాటిపై చర్చించాలని కూడా సూచించారు.