అస్సాంలో తమకు 49 శాతం ఓట్లు వచ్చాయని బీజేపీ నేత రాంమాధవ్ వెల్లడించారు.
గువాహటి: ఈశాన్య భారతంలో తొలిసారిగా కమలం వికసించింది. అసోంలో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అస్సాం ప్రజలు ముగింపు పలికారు. హస్తం పార్టీ ఘోర పరాజయం దిశగా కదులుతోంది.
మార్పు కోసమే ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని బీజేపీ నేత రాంమాధవ్ తెలిపారు. అస్సాంలో తమకు 49 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అస్సాంలో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన హిమంత బిశ్వ శర్మ విజయం సాధించారు. అస్సాం బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.