'కశ్మీరీలకు భద్రత కల్పించండి' | Rajnath tells all states to ensure safety of Kashmiris | Sakshi
Sakshi News home page

'కశ్మీరీలకు భద్రత కల్పించండి'

Apr 21 2017 12:11 PM | Updated on Sep 5 2017 9:20 AM

'కశ్మీరీలకు భద్రత కల్పించండి'

'కశ్మీరీలకు భద్రత కల్పించండి'

దేశం నలుమూలలా నివసిస్తున్న కశ్మీరీల భద్రతను కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

న్యూఢిల్లీ: దేశం నలుమూలలా నివసిస్తున్న కశ్మీరీల భద్రతను కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కశ్మీరీలను వేధిస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఓ అడ్వైజరీ పంపినట్లు వెల్లడించారు.

మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీరీలతో కొందరు తప్పుగా ప్రవర్తించారనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో సైన్యంపై రాళ్లు రువ్వడంపై ఉత్తరప్రదేశ్‌, రాజస్ధాన్‌ రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులు ఎదురయ్యాయనే రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement