పోలీసు దాడులు: ఎమర్జెన్సీకి చేరువలో ఉన్నాం

Raids in 5 states in connection with Maoist plot to assassinate PM Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మంగళవారం తెల్లవారు జామునుంచే ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర పోలీసులు విరుచుకుపడ్డారు. ముంబై, ఢిల్లీ, గోవా, జార్ఖండ్, తెలంగాణ(హైదరాబాద్‌)లో దళిత, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, లాయర్లు, ఆదివాసీ హక్కుల కార్యకర్తల ఇళ్లు, వారి బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహాయంతో పుణేకు చెందిన పోలీసు బృందం ఈ సోదాలు నిర్వహించింది.  ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా  అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టడం తీవ్ర ఆందోళన రేపింది.

హైదరాబాద్‌కు చెందిన విప్లవ కవి, విరసం నేత వరవరరావును అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. అలాగే జర్నలిస్టులు కూర్మనాథ్‌, క్రాంతి, ఇఫ్లూ ప్రొఫెసర్‌ సత్యనారాయణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులకు దిగడం కలకలం రేపింది. ముంబైలోని అరుణ్ ఫెరీరా, సుసాన్ అబ్రహాం, వెర్నాన్ గోన్సల్వేజ్, ఆనంద్ తెల్తూంద్డే, జార్ఖండ్‌ లోని ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి, ఢిల్లీలో గౌతమ్ నవ్‌లాఖా, ఛత్తీస్‌గఢ్‌, ఫరీదాబాద్‌ మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్‌ గృహాలను తనిఖీ చేశారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, పెన్‌డ్రైవ్‌తోపాటు, డైరీలు, కొన్ని ఆడియో సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలు, భీమా-కోరేగావ్ నిరసన సందర్భంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. చట్టవిరుద్ధ చర్యలు(నివారణ) చట్టం ఐపీసీ సెక్షన్ 153ఏ, 505, 117, 120 కింద అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవి అక్రమ అరెస్టులంటూ వివిధ ప్రజా సంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉద్యమానికి సన్నద్ధమవుతునన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల సహాయంతో ప్రజాస్వామ్య గొంతులను అణచివేయడానికి  కేంద్రం పన్నిన కుట్రలో భాగమే ఈ అరెస్టులని విరసం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌ ఆరోపించారు.

అత్యవసర పరిస్థితికి దగ్గరగా ఉన్నాం: అరుంధతీ రాయ్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరుల ఇళ్లపై పుణే పోలీసుల దాడులపై ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్  స్పందించారు. దేశంలో గతంలో ముందెన్నడూ చూడని అత్యవసర పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నామని ఆమె తీవ్రంగా విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top