నితీష్‌ కుమార్‌ వస్తానంటే వద్దనం : ఆర్జేడీ

Rabri Devi Says No Objection If Nitish Kumar Returns To Grand Alliance - Sakshi

పట్నా : నూతనంగా ఏర్పాడిన కేంద్ర మంత్రి వర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్‌ రబ్రీ దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయని.. నితీష్‌ కుమార్‌ ఎప్పుడైనా కూటమిలో చేరవచ్చని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నితీష్‌ కుమార్‌ మహాకూటమిలో చేరతానంటే మాకేం అభ్యంతరం లేదు. మేం ఆయనను స్వాగతిస్తున్నాం’ అన్నారు.

ఆర్జేడీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు రఘువంశ ప్రసాద్‌ సింగ్‌ స్వాగతించారు. అయితే నితీష్‌ ఎప్పుడు ఎవరి వైపు మారతాడో.. ఎవరికి మద్దతిస్తాడో ఊహించలేం అన్నాడు. గతంలో చాలా సార్లు అతను ఇలానే చేశాడని గుర్తు చేసుకున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునే వారికి తాను మద్దతిస్తానని తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం నితీష్‌ కుమార్‌ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. ఎన్డీఏతో చేరిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top