‘హరియాణాలో మళ్లీ మేమే’

PM Narendra Modi Sounds Poll Bugle In Haryana - Sakshi

చండీగఢ్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. రోహ్తక్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ హరియాణాలో పదికి పది పార్లమెంట్‌ స్ధానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత కొద్ది నెలలుగా రోహ్తక్‌ తాను రావడం ఇది మూడవసారని, ప్రజల నుంచి మరింత మద్దతు కోరేందుకు ఇక్కడకు వచ్చానని, తాను కోరినదానికంటే మిన్నగా రోహ్తక్‌ ప్రజలు తనకు అందించారని చెప్పుకొచ్చారు. హరియాణాలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మీరిస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో కాషాయ ప్రభంజనం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన తరహాలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు బాసటగా నిలవాలని ప్రధాని కోరారు. గత వందరోజులగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, మార్పు దిశగా పురోగతి సాధిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడిందని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top