శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ | PM Narendra Modi meets the President of Sri Lanka | Sakshi
Sakshi News home page

శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

Oct 16 2016 10:25 AM | Updated on Aug 15 2018 2:30 PM

గోవా రాజధాని పణజీలో బ్రిక్స్ సదస్సు రెండోరోజు ప్రారంభమైంది.

పణజీ:  గోవా రాజధాని పణజీలో బ్రిక్స్ సదస్సు రెండోరోజు ప్రారంభమైంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల్ శ్రీసేనాతో భేటీ అయ్యారు. అనంతరం భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గేతో కూడా మోదీ సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.

కాగా  ఇవాళ బ్రిక్స్ దేశాధినేతల సమావేశం తర్వాత.. బ్రిక్స్-బిమ్స్‌టెక్(బంగాళాఖాత దేశాల సాంకేతిక, ఆర్థిక సహకార కూటమి) సభ్యదేశాల సమావేశం జరగనుంది. సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు ఇందులోని నాలుగు దేశాలు విముఖత చూపిన నేపథ్యంలో బ్రిక్స్-బిమ్స్‌టెక్ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.

మరోవైపు శనివారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్స్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement