సోనియాతో మోదీ 'చాయ్ పె చర్చా'.. | PM Modi invites Congress president Sonia Gandhi, Former PM Dr. Manmohan Singh for tea | Sakshi
Sakshi News home page

సోనియాతో మోదీ 'చాయ్ పె చర్చా'..

Nov 27 2015 10:50 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియాతో మోదీ 'చాయ్ పె చర్చా'.. - Sakshi

సోనియాతో మోదీ 'చాయ్ పె చర్చా'..

ఎన్డీఏ ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు 'ఆమోదం' గట్టెక్కకుండా 'పెండింగ్'లోయలోనే మగ్గిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ.. సోనియా, మన్మోహన్ సింగ్ లను తేనీటి విందుకు ఆహ్వానించారు.

న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు 'ఆమోదం' గట్టెక్కకుండా 'పెండింగ్'లోనే మగ్గిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రధానాంశమైన వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లు సహా ఇతర కీలక బిల్లుల ఆమోదానికి ప్రధాన విపక్ష పార్టీతో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోయినా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను శుక్రవారం తేనీటి విందుకు ఆహ్వానించారు. నేటి పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఈ 'చాయ్ పె చర్చా' ప్రారంభమవుతుందని, ఇరు పక్షాల మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని  అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తోపాటు విపక్షాలన్నింటితో మాట్లాడుతూనే ఉన్నామని, ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకముందన్నారు. రాజ్యాంగం అమలుపై జరుగుతున్న ప్రత్యేక చర్చలో భాగంగా నేడు లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారని, మరో మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement