ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పైలీన్ తుపాను, వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇవ్వనుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పైలీన్ తుపాను, వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇవ్వనుంది. అలాగే గాయపడిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలకు తక్షణ సాయం కింద కేంద్రం వెయ్యికోట్ల రూపాయలు విడుదల చేసింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తరువాత కేంద్రం ఈ సహాయాన్ని పెంచుతుంది.