‘మహాత్మ’ వద్దన్నందుకు జరిమానా | PIL to ban prefix 'Mahatma' before Gandhi's name | Sakshi
Sakshi News home page

‘మహాత్మ’ వద్దన్నందుకు రూ పదివేలు వడ్డింపు

Nov 14 2017 10:30 AM | Updated on Oct 8 2018 3:56 PM

 PIL to ban prefix 'Mahatma' before Gandhi's name - Sakshi

సాక్షి, చెన్నై: కరెన్సీ నోట్లపై గాంధీ పేరు ముందు మహాత్మ పదాన్ని వాడటం నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌ను కోర్టు తీవ్రంగా మందలించింది. న్యాయస్ధానం విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ వర్సిటీ రీసెర్చి స్కాలర్‌ మురుగనాథమ్‌కు రూ పదివేలు జరిమానా విధించింది. ఇలాంటి పిటిసన్లతో న్యాయవ్యవస్థ విలువైన సమయం వృధా అవుతుందని పిటిషన్‌ను తోసిపుచ్చుతూ జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం సుందర్‌తో కూడిన హైకోర్టు బెంచ్‌ స్పష్టం చేసింది.

భారత కరెన్సీ నోట్లపై గాంధీ పేరు ముందు మహాత్మా అని వాడటం రాజ్యాంగ చెల్లుబాటును పిటిషన్‌లో మురుగనాధమ్‌ సవాల్ చేశారు. ఆర్‌బీఐ మహాత్మా అనే పదం వాడటం రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు.అయితే ఈ పిటిషన్‌ ఏమాత్రం విచారణార్హమైనది కాదని మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement