భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol price hiked by Rs. 3.07 per litre and Diesel price by Rs. 1.90 per litre | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Mar 16 2016 7:01 PM | Updated on Sep 28 2018 3:22 PM

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Sakshi

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు భారీ షాక్. కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డిజీల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

న్యూఢిల్లీ : వాహనదారులకు భారీ షాక్.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.3.07, డీజిల్ రూ.1.90 పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయించాయి. పెంచిన ధరలు  గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

 

కొత్త ధరల ప్రకారం నాలుగు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ఢిల్లీలో రూ.59.68, కోల్కతాలో రూ.63.76, ముంబయి రూ.65.79, చెన్నైలో రూ.59.13 పైసలకు పెరగనుంది. చివరిగా చమురు ధరలు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేవపెట్టిన ఫిబ్రవరి 29న పెట్రోల్ ధర తగ్గగా, డీజిల్ ధర పెరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement