9 పైసలు తగ్గిన పెట్రో ధరలు | Petrol, diesel prices cut by 9 paise | Sakshi
Sakshi News home page

9 పైసలు తగ్గిన పెట్రో ధరలు

Jun 3 2018 5:00 AM | Updated on Jul 6 2019 3:22 PM

Petrol, diesel prices cut by 9 paise - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి బలం పుంజుకోవడంతో పాటు అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోవడంతో శనివారం4 మెట్రో నగరాల్లో లీటరు డీజిల్, పెట్రోల్‌ ధరలు 9 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.78.20, ముంబైలో 86.01, చెన్నైలో 81.19, కోల్‌కతాలో రూ.80.84గా కొనసాగుతోంది. ఇక డీజిల్‌ ధరలు ఢిల్లీలో రూ.69.11, కోల్‌కతాలో రూ.71.66, ముంబైలో రూ.73.58, చెన్నైలో రూ.72.97కి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు డాలర్‌ చొప్పున తగ్గాయి. ఫలితంగా ఇంధన ధరలు భారత్‌లోనూ స్వల్పంగా దిగివచ్చాయి.  

Advertisement
 
Advertisement
Advertisement