‘పార్లమెంటు క్యాంటీన్ తిండితో ఎంపీలకు అనారోగ్యం’ | Parliament canteen food not good, complain MPs | Sakshi
Sakshi News home page

‘పార్లమెంటు క్యాంటీన్ తిండితో ఎంపీలకు అనారోగ్యం’

Jul 31 2014 12:57 AM | Updated on Sep 2 2017 11:07 AM

పార్లమెంట్ క్యాంటీన్ అందించే అహారం నాసిరకంగా ఉందని పలువురు ఎంపీలు బుధవారం రాజ్యసభలో ఫిర్యాదు చేశారు. ఈ తిండి తిని ఎంపీలు అనార్యోగం బారిన పడుతున్నారని జేడీయూ ఎంపీ కేసీ త్యాగి తెలిపారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ క్యాంటీన్ అందించే అహారం నాసిరకంగా ఉందని పలువురు ఎంపీలు బుధవారం రాజ్యసభలో ఫిర్యాదు చేశారు. ఈ తిండి తిని ఎంపీలు అనార్యోగం బారిన పడుతున్నారని జేడీయూ ఎంపీ కేసీ త్యాగి తెలిపారు. ఎస్పీ సభ్యులు రామ్‌గోపాల్ యాదవ్, జయాబచ్చన్‌లు అస్వస్థతకు గురయ్యారన్నారు. ‘సభ్యుల నోళ్లు మూయించేందుకు పకడ్బందీగా కుట్ర పన్నారు’ అని చెణుకు విసిరారు.

క్యాంటీన్‌కు ఆహారాన్ని గుజరాత్ నుంచి తెప్పిస్తున్నారని విపక్ష సభ్యులు అన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య స్పందిస్తూ.. ‘కొందరు గుజరాత్ గురించి కలకంటూనే ఉన్నారు. నేనేం చేయగలను?’ అని అన్నారు. క్యాంటీన్‌లో ఉదయం 6 గంటలకు వండిన ఆహారాన్ని రాత్రివరకు పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా చెప్పారు.         
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement