నయిగావ్‌లో ఉచిత నేత్ర వైద్యశిబిరం | Ophthalmology camp free in naigaon | Sakshi
Sakshi News home page

నయిగావ్‌లో ఉచిత నేత్ర వైద్యశిబిరం

Nov 26 2014 11:01 PM | Updated on Sep 2 2017 5:10 PM

తూర్పు దాదర్‌లోని నయిగావ్‌లో పద్మశాలి యువక సంఘం, ముంబై ఆధ్వర్యంలో...

సాక్షి, ముంబై: తూర్పు దాదర్‌లోని నయిగావ్‌లో పద్మశాలి యువక సంఘం, ముంబై ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. డా. ప్రవీణ్ జువారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో హాజరైనవారికి నేత్ర పరీక్షలకు ముందు డయాబిటీస్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో కొందరికి కంటి చూపు దెబ్బ తిందని, మరికొందరికి మోతి బిందువులు ఉన్నాయని ైవె ద్యులు నిర్ధారించారు.

 కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, ట్రస్టీ సభ్యులు ముశం నారాయణ, బుదారపు రాజారాం, భోగా కళావతి, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, కోశాధికారి జెల్లా పురుషోత్తం, సంఘం కార్యదర్శి దోర్నాల మురళీధర్, గంజి మల్లేశం, మెడికల్ వైస్ చైర్మన్ చిలివేరు మహేంద్ర, కన్వీనరు లకిశెట్టి రవీంద్ర, కార్యవర్గ సమితి సభ్యులు కైరంకొండ వెంకటేశం తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement