ఎంత చెత్త వంటకం, యాక్‌!! | Netizens Fires On New Nutella Biryani | Sakshi
Sakshi News home page

ఈ కొత్త వంటకంపై నెటిజన్ల ఆగ్రహం

May 30 2020 1:41 PM | Updated on May 30 2020 1:55 PM

Netizens Fires On New Nutella Biryani - Sakshi

న్యూటెల్లా బిర్యానీ

గులాబ్‌ జామున్‌ పావ్‌బాజీ, కుర్‌కురే మిల్క్‌ షేక్‌ వంటి వింతైన వంటకాల గురించి మీరు వినే ఉంటారు. తీపి వంటకాన్ని, మసాలా వంటకాన్ని మిక్స్‌ చేస్తే వచ్చిన సంకర జాతి వంటకాలు అవి. ఒకప్పుడు ఇంటర్‌నెట్‌లో తెగ చక్కర్లు కొట్టిన ఆ వంటకాలు నెటిజన్ల నుంచి భారీ అసహ్యాన్నే మూటగట్టుకున్నాయి. తాజాగా ఇలాంటి మరో వింతైన వంటకం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. అదే ‘‘న్యూటెల్లా బిర్యానీ’’. బిర్యానీని, న్యూటెల్లాను కలిపి తయారు చేసిన వంటకం ఇది. ప్రస్తుతం ఈ వింత వంటకం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బిర్యానీ లవర్స్‌ దీనిపై మండిపడుతున్నారు. ( ఏంటిది.. చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్‌! )

ఈ వంటకంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ నేనిక ఈ భూమ్మీద ఉండలేను.. ఎంత చెత్త వంటకం, యాక్‌!!.. చెత్త ఐడియా, న్యూటెల్లాను ఎవరైనా బిర్యానీతో కలుపుతారా?.. ఈ వంటకాన్ని తయారు చేసినోడిని జైల్లో వేయాలి’’ అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది తమదైన శైలిలో మీమ్స్‌ పెడుతూ రెచ్చిపోతున్నారు.

చదవండి : లిఫ్ట్‌లో నరకం అనుభవించిన చిన్నారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement