రాజీవ్కు ప్రధాని మోదీ నివాళి | Narendra modi pays tribute to Rajiv gandhi | Sakshi
Sakshi News home page

రాజీవ్కు ప్రధాని మోదీ నివాళి

Aug 20 2015 12:03 PM | Updated on Aug 15 2018 2:20 PM

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.    ఈ మేరకు మోదీ గురువారం  ట్విట్ చేశారు. 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని  1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement