రాష్ట్రపతితో ప్రధాని భేటీ | Narendra Modi meets President Ram Nath Kovind to discuss various issues | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

Jul 6 2020 5:58 AM | Updated on Jul 6 2020 5:58 AM

Narendra Modi meets President Ram Nath Kovind to discuss various issues - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. వారిరువురు ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారని రాష్ట్రపతి భవన్‌ అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొనడం, తాజాగా, శుక్రవారం లేహ్‌ వెళ్లిన ప్రధాని, అక్కడ బలగాలను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేయడం.. తదితర కీలక ఘటనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement