‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ | Minister Uma Bharti was sensational comments about the rama mandiram | Sakshi
Sakshi News home page

‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ

Apr 9 2017 7:25 AM | Updated on Sep 5 2017 8:22 AM

‘మందిరం’  కోసం చావడానికైనా రెడీ

‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ

రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అన్నారు.

ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని, మందిరం కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను కలిసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ‘రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. దానిపై నాకెంతో గౌరవం ఉంది.

మందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరేసుకోడానికైనా సిద్ధం’  అని చెప్పారు. ‘ రామ మందిరంపై చర్చించాల్సిందేమీ లేదు. ఈ అంశం మాకేం కొత్త కాదు. రామ మందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్‌ గురువు అవైద్యనాథ్‌ నాయకుడు’ అని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement