ఆంటిగ్వాలో మెహుల్‌ చోక్సీ

Mehul Choksi in Antigua, secures local passport - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ కరీబియన్‌ దేశం ఆంటిగ్వాకు వెళ్లినట్లు తెలిసింది. అమెరికా నుంచి ఆంటిగ్వా వెళ్లి ఆయన అక్కడి పాస్‌పోర్టును కూడా సంపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇంటర్‌పోల్‌ నోటీసులకు స్పందించిన ఆంటిగ్వా అధికారులు.. ఈ సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అందజేశారు. ఈ నెలలోనే చోక్సీ ఆంటిగ్వా చేరుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడటానికి 15 రోజుల ముందు చోక్సీ దేశం విడిచివెళ్లాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top