సీఎం సోదరుడి ఇంట్లో యువకుడి చొరబాటు | man enter jayalalitha's brother house | Sakshi
Sakshi News home page

సీఎం సోదరుడి ఇంట్లో యువకుడి చొరబాటు

Jan 9 2016 11:07 AM | Updated on Sep 3 2017 3:23 PM

సీఎం సోదరుడి ఇంట్లో యువకుడి చొరబాటు

సీఎం సోదరుడి ఇంట్లో యువకుడి చొరబాటు

ముఖ్యమంత్రి జయలలిత సోదరుని ఇంట్లోకి హఠాత్తుగా ఒక యువకుడు చొరబడ్డాడు.

చెన్నై:  ముఖ్యమంత్రి జయలలిత సోదరుని ఇంట్లోకి హఠాత్తుగా ఒక యువకుడు చొరబడ్డాడు. టీనగర్, శివజ్ఞానం వీధిలో ముఖ్యమంత్రి జయలలిత అన్న జయరామన్ నివాసం వుంది. ఈ ఇంట్లో ప్రస్తుతం జయరామన్ కుటుంబీకులు నివశిస్తున్నారు. జయ సోదరుని ఇల్లు కావడంతో అన్ని వేళలా భద్రత ఉంటుంది.  ఈ ప్రాంతంలో ఒక యువకుడు తరచుగా సంచరించేవాడు. దీన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు.

సదరు యువకుడు శుక్రవారం హఠాత్తుగా జయరామన్ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడి భద్రతా సిబ్బంది, జయరామన్ కుటుంబీకులు అప్రమత్తమయ్యారు. వెంటనే దీని గురించి మాంబళం పోలీసు స్టేషన్‌కు సమాచారం తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ యువకుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను విరుదాచలంకు చెందిన రాజమహేంద్రన్‌గా తెలిసింది. ఇతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మానసిక  స్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. దీంతో అతన్ని హెచ్చరించి పంపించి వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement