రయ్‌ రయ్‌..నాలుగు చక్రాల సైకిలోయ్‌! | 14 year old K Sabarivasan Made four-wheel cycle | Sakshi
Sakshi News home page

రయ్‌ రయ్‌..నాలుగు చక్రాల సైకిలోయ్‌!

Mar 27 2026 1:32 PM | Updated on Mar 27 2026 1:41 PM

14 year old K Sabarivasan Made four-wheel cycle

తమిళనాడు వెల్లూరులోని వాణివిద్యాలయంలో పదవతరగతి చదువుతున్న శబరివాసన్‌ నాలుగు చక్రాల సైకిల్‌ తయారుచేసి ‘ఆహా!’ అనిపించుకున్నాడు. వృథాగా పడి ఉన్న వస్తువులతో ఈ నాలుగు చక్రాల సైకిల్‌ను తయారుచేయడం విశేషం. 

‘ఎవరి సలహాలు, సూచనలు తీసుకోకుండానే మా అబ్బాయి ఈ సైకిల్‌ను తయారుచేశాడు’ అని సంబరపడిపోతున్నాడు శబరివాసన్‌ తండ్రి కతిర్వేల్‌. ఆయన క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శబరివాసన్‌కు సైకిల్‌ నుంచి కారు వరకు రకరకాల వాహనాల గురించి ఆసక్తి. వాటిలో ఏ భాగాలు ఉంటాయి? అది ఎలా పనిచేస్తుంది?... మొదలైన వివరాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాలుగు చక్రాల సైకిల్‌ తయారుచేయడానికి కారణం అయింది.

అందుబాటులో ఉన్న వస్తువులతోనే రకరకాల వాహనాలు తయారుచేసిన వ్యక్తుల వీడియోలు తరచుగా చూసేవాడు. ఆ సమయంలోనే తనకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, స్పేర్‌ ట్యూబ్‌లను సేకరించి నాలుగు చక్రాల సైకిల్‌ను తయారు చేశాడు. ఈ వాహనాన్ని తయారుచేయడానికి నెలరోజుల సమయం పట్టింది.‘నేను తయారుచేసిన నాలుగు చక్రాల సైకిల్‌ను చాలామంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త వాహనాలు తయారుచేస్తాను’ అని ధీమాగా అంటున్నాడు శబరివాసన్‌. 

(చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement