తమిళనాట ఎన్నికల హీట్.. విజయ్‌కే నా ఓటు అంటోన్న హీరోయిన్..! | Kollywood actress Vani Bhojan Full Support To TVK Vijay in elections | Sakshi
Sakshi News home page

Vani Bhojan: కోలీవుడ్‌ను తాకిన ఎన్నికల హీట్.. విజయ్‌కే నా ఓటు..!

Mar 30 2026 7:54 AM | Updated on Mar 30 2026 8:09 AM

Kollywood actress Vani Bhojan Full Support To TVK Vijay in elections

ఈ మండు వేసవిలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. సినిమా రంగంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. సినీ తారలు తమకు నచ్చిన వారికి సపోర్ట్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి వాణిభోజన్‌ తన మద్దతు టీవీకే ఛీఫ్ విజయ్‌కే అని ప్రకటించారు. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ..  ఓమై కడవుల్‌ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత  మహాన్, మిరన్‌ వంటి పలు చిత్రాల్లో వాణి భోజన్ నటించారు. కొన్ని వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హీరోయిన్‌గా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. కాగా ఇటీవల తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాణి భోజన్‌  పలు విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తాను నటుడు విజయ్‌కు   వీరాభిమానినని.. ఆయనకు జంటగా నటించాలన్న కోరిక ఉందని తెలిపింది. అయితే విజయ్‌ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఆ కోరిక నెరవేరే అవకాశం లేదని పేర్కొంది. అయితే విజయ్‌ రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాని వెల్లడించింది.

విజయ్‌ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషమని అన్నారు. మీకు ఆ పార్టీలో చేరే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారని, అయితే దాని గురించి తరువాత చెబుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు మాత్రం విజయ్‌కే నని తెలిపింది. కాగా ప్రస్తుతం తాను  ఈ భామ ప్రస్తుతం వలై అనే చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తున్నట్లు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement