ఎలుకల మందుతో పళ్లు తోముకుని.. | Man Brushes Teeth With Rat Poison In Hosur | Sakshi
Sakshi News home page

పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని..

Jun 29 2020 11:35 AM | Updated on Jun 29 2020 12:22 PM

Man Brushes Teeth With Rat Poison In Hosur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని హోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరి సమీపంలోని మొల్లంపట్టి గ్రామానికి చెందిన సేదుపతి(18) అనే యువకుడు అదే ప్రాంతంలోని జ్యూస్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈనెల 21వ తేదీ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకొని స్పృహకోల్పోయాడు. అస్వస్థతకు గురైన అతన్ని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement