రెచ్చిపోయిన మావోయిస్టులు | maioists hulchaul in narayanapur district | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మావోయిస్టులు

May 18 2017 4:02 PM | Updated on Oct 9 2018 2:53 PM

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు.

రాయిపూర్‌: పోలీసులు, మావోయిస్టుల చర్య.. ప్రతిచర్యలతో అట్టుడుకుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నారాయణపూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధనోరా- ఓర్చా గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగుపై వంతెన నిర్మాణం జరుగుతోంది.
 
గురువారం ఉదయం సుమారు 50 మంది మావోయిస్టులు అక్కడికి చేరుకుని, పనులు నిర్వహిస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం అక్కడ ఉన్న ట్రాక్టర్‌తో పాటు కాంక్రీట్‌ మిక్సింగ్‌ మెషిన్‌ను పెట్రోల్‌ పోసి తగుల బెట్టారు. వంతెన నిర్మాణ పనుల్లో ఎవరైనా పాల్గొంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement