కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట! | Maharastra court exempts Rahul Gandhi from appearance in defamation case | Sakshi
Sakshi News home page

కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట!

Oct 7 2014 4:36 PM | Updated on Oct 8 2018 6:18 PM

కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట! - Sakshi

కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట!

పరువు నష్టం దావా కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మహారాష్ట్రలోని బీవాండీ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది.

థానే: పరువు నష్టం దావా కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మహారాష్ట్రలోని బీవాండీ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఈకేసులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. గత లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు.
 
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనంటూ దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయమూర్తి ఎస్ వీ స్వామి సానుకూలంగా స్పందించారు. జాతిపిత మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చంపారని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పై బీవాండీ యూనిట్ ఆర్ఎస్ఎస్ రాజేశ్ కుంటే కేసు నమోదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement