క్యాంపాకోలా వాసులకు లతా మంగేష్కర్ మద్దతు | Lata Mangeshkar support to campa cola residents | Sakshi
Sakshi News home page

క్యాంపాకోలా వాసులకు లతా మంగేష్కర్ మద్దతు

Jun 9 2014 10:23 PM | Updated on Sep 2 2017 8:33 AM

కాంప్యాకోలా వాసులకు ప్రముఖ గాయకురాలు లతామంగేష్కర్ మద్దతు పలికారు. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్యులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబై: కాంప్యాకోలా వాసులకు ప్రముఖ గాయకురాలు లతామంగేష్కర్ మద్దతు పలికారు. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్యులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో తమ ఫ్లాట్లను ఖాళీ చేస్తున్నవారికి అండగా నిలవాలని, వారిని శిక్షించవ ద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విషయం అడగాలనుకుంటున్నా.. సుప్రీంకోర్టు నిర్ణయంతో వందలాదిమంది పిల్లలు, పెద్దలు నిరాశ్రయులయ్యారు. తీవ్ర ఒత్తిడికి లోనైన ముగ్గురు ఇప్పటికే మృతిచెందారు కూడా.
 
ఇది అన్యాయం. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్య జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల’ని ట్విటర్‌లో పేర్కొన్నారు. దక్షిణ ముంబైలోని క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 1981 నుంచి 1989 మధ్య కాలంలో ఏడు భవనాలను నిర్మించారు. ఇక్కడ కేవలం ఆరు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించే అనుమతి ఉన్నా బిల్డర్లు నిబంధనలను అతిక్రమించారు. మిడ్‌టౌన్ బిల్డింగ్‌లో 20 అంతస్తులు, ఆర్చిడ్ బిల్డింగ్‌లో 17 అంతస్తులు నిర్మించారు. ఇలా మొత్తం   ఏడు భవనాల్లో అక్రమంగా 102 ఫ్లాట్లు ఉన్నాయి. వీరంతా ఖాళీ చేయాలని, అదనంగా ఉన్న అంతస్తులను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement