బస్‌లు, క్యాబ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌

kejriwal Says All Offices To Reopen In Capital - Sakshi

ఢిల్లీలో భారీ సడలింపులు

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ 4.0 అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ సడలింపులు ప్రకటించారు. 20 మంది ప్రయాణీకులతో బస్‌లను అనుమతిస్తామని, ఇద్దరు ప్రయాణీకులతో కార్లను, ఒక ప్రయాణీకుడితో ఆటోలు, ఈ రిక్షాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. సరి-బేసి పద్ధతిలో అన్ని షాపులు తెరుచుకుంటాయని, అన్ని కార్యాలయాలను అనుమతిస్తామని వెల్లడించారు.

ప్రతి ప్రయాణం ముగిసిన తర్వాత వాహనాలను డ్రైవర్లు పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఇక సెలూన్‌, బార్బర్‌ షాపుల మూసివేత కొనసాగుతుందని చెప్పారు. రెస్టారెంట్లను కేవలం హోం డెలివరీ కోసమే అనుమతిస్తామని తెలిపారు. అయితే మెట్రోలు, మాల్సా్‌, థియేటర్లను  తెరిచేందుకు అనుమతించబోమని చెప్పారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మహమ్మారి బారినపడకుండా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శాలను అనుసరించాలని కోరారు. 

చదవండి : ‘కోవిడ్‌-19 ఖాతాలో చేరని మరణాలు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top