జయ సంక్రాంతి కానుక | Jaya Sankranti gift | Sakshi
Sakshi News home page

జయ సంక్రాంతి కానుక

Jan 7 2016 2:34 AM | Updated on Aug 14 2018 2:14 PM

తమిళనాడులో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందుకుంటున్న వారికి సీఎం జయలలిత సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు.

చెన్నై: తమిళనాడులో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందుకుంటున్న వారికి సీఎం జయలలిత సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు.  రెండుకోట్ల మందికి ‘పొంగల్ గిఫ్ట్ ప్యాక్’ ఇవ్వనున్నారు. ఇందులో ఈ నెల సరుకుల (కిలో బియ్యం, పంచదార) తోపాటు రెండు చెరకుగడ ముక్కలు (పండగ సాంప్రదాయం) రూ. 100 నోటుఉంటాయని జయ  తెలిపారు. కాగా, మదురైలోని మీనాక్షి గుడి పరిసరాల్లో దుండగులు మంగళవారం అర్ధరాత్రి మూడు పెట్రోల్ బాంబులు విసిరి పారిపోయారు. ఎవరికీ హాని జరగలేదు.  ఒక బాంబే పేలింది. 

Advertisement
 
Advertisement
Advertisement