అమర్ సింగ్ కు వ్యతిరేకంగా జయబచ్చన్ ప్రచారం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అమర్ సింగ్, బచ్చన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి.
ఆగ్రా: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అమర్ సింగ్, బచ్చన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి. అయితే ములాయం సింగ్ యాదవ్ తో విబేధించి సమాజ్ వాదీ పార్టీకి గుడ్ బై చెప్పాక అమర్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీ తరపున ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుంచి అమర్ సింగ్ పోటీలో ఉన్నారు.
ఏప్రిల్ 24 తేదిన జరిగే ఎన్నికల్లో అమర్ సింగ్ కు వ్యతిరేకంగా సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్ ప్రచారం చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలిసి జయ బచ్చన్ ఫతేబాద్, ఎత్మద్ పూర్, ఫతేపుర్ సిక్రి ప్రచారం చేపట్టనున్నారు. ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జయప్రద, శ్రీదేవి, బోని కపూర్, రాజా మురాద్, అస్రానీ తదితర బాలీవుడ్ ప్రముఖులతో ఇటీవల అమర్ సింగ్ ర్యాలీలు నిర్వహించారు.