భారతీయ ‘రైల్వేగీతం’ విడుదల | Indian ' railway song ' Release | Sakshi
Sakshi News home page

భారతీయ ‘రైల్వేగీతం’ విడుదల

Aug 5 2016 7:47 PM | Updated on Sep 4 2017 7:59 AM

భారతీయ రైల్వే వ్యవస్థపై మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.

సాధారణ ప్రజలకు ఎంతో చేరువైన భారతీయ రైల్వే వ్యవస్థపై మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రత్యేక గీతాన్ని (రైల్ గీత్) విడుదల చేశారు. సంగీత దర్శకుడు శరవణ్ స్వరపరిచిన ఈ మూడు నిమిషాల గీతాన్ని గాయకులు ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి ఆలపించారు.

ఈ గీతం రైల్వే వినియోగదారులకు, ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చి, భారతీయ రైల్వే అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే శాఖకు సంబంధించిన కార్యక్రమాల ప్రారంభంలో ఈ పాటను ఆలపించనున్నట్లు వెల్లడించారు. అతి పెద్ద భారతీయ రైలే ్వ వ్యవస్థ సమర్థంగా పని చేసేందుకు కృషి చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల నిబద్ధత, అంకితభావానికి ఈ పాట ప్రతీక అని మంత్రి అభివర్ణించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement