అలా అయితే పాక్కు సాయం: రాజ్నాథ్ | If Pakistan is serious about fighting terror then we are ready to help, rajnath | Sakshi
Sakshi News home page

’అలా అయితే పాకిస్తాన్ కు సాయం చేస్తాం’

Oct 17 2016 12:48 PM | Updated on Sep 4 2017 5:30 PM

అలా అయితే పాక్కు సాయం: రాజ్నాథ్

అలా అయితే పాక్కు సాయం: రాజ్నాథ్

ఉగ్రవాదంపై పాకిస్తాన్ చిత్తశుద్ధితో పోరాడితే సహకరించేందుకు తాము సిద్ధమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై పాకిస్తాన్ చిత్తశుద్ధితో పోరాడితే సహకరించేందుకు తాము సిద్ధమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఛండీగఢ్లో జరుగుతున్న ప్రాంతీయ సంపాదకుల సదస్సులో రాజ్నాథ్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయితే పాక్కు ఆ ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులకు, ఉగ్రవాదుల మధ్య వ‍్యత్యాసాన్ని పాకిస్తాన్ మర్చిపోయిందంటూ రాజ్నాథ్  ఎద్దేవా చేశారు. సరిహద్దుల నుంచే ఉగ్రవాద బెడద ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ముంబయి దాడుల నేపథ్యంలో తీరప్రాంతాల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.  బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దులను పాటు ఈశాన్య ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.

అలాగే భారత్ ఆర్థిక వృద్ధి సాధించటంలో ముందంజలో ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోకి భారత్ ఒకటని రాజ్నాథ్ గుర్తు చేశారు. ఆర్థిక వృద్ధి ఇలాగే కొనసాగితే భారత్ మూడో స్థానంలో ఉంటుందన్నారు. అయితే కొన్ని ఓర్వలేని శక్తులు భారత్ను దెబ్బతీయాలని చూస్తున్నాయంటూ రాజ్నాథ్ పాకిస్తాన్పై విమర్శలు చేశారు. అలాగే  సైబర్ నేరాలు కూడా ప్రధాన సమస్యగా  మారిందని, దీని నిర్మూలన కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక భారత్, చైనాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయని రాజ్నాథ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement