
సామాజిక దూరంతోనే మహమ్మారికి దూరం..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారికి ముప్పును తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుందని అన్నారు. కోవిడ్-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 24,99,723కు చేరగా మృతుల సంఖ్య 1,71,718కి పెరిగింది. 6,59,589 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.