‘అందుకే హార్దిక్‌ చెంప చెళ్లుమనిపించా’ | I Have To Teach Lesson To Hardik Patel | Sakshi
Sakshi News home page

‘అందుకే హార్దిక్‌ చెంప చెళ్లుమనిపించా’

Apr 19 2019 2:30 PM | Updated on Apr 19 2019 6:51 PM

I Have To Teach Lesson To Hardik Patel  - Sakshi

హార్దిక్‌ పటేల్‌పై దాడి చేయాలని అప్పుడే అనుకున్నాను.

అహ్మదాబాద్‌: ‘పటీదార్‌ ఉద్యమం నడుస్తున్నపుడు నా భార్య గర్భవతి. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాను. ఆ సమయంలో పటీదార్‌ ఉద్యమం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. హార్దిక్‌ పటేల్‌పై దాడి చేయాలని అప్పుడే అనుకున్నాను. ఎలాగైనా అతడికి తగిన గుణపాఠం చెప్పాలని గట్టిగా భావించాను’.. ఇవి హార్దిక్‌ పటేల్‌ను చెంప దెబ్బ కొట్టిన తరుణ్‌ గజ్జర్‌ అనే వ్యక్తి చెప్పిన మాటలు.

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో శుక్రవారం ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్‌ పటేల్‌పై తరుణ్‌ గజ్జర్‌ హఠాత్తుగా దాడి చేశాడు. ఊహించని పరిణామంతో హార్దిక్‌ బిత్తరపోయారు. దాడికి పాల్పడిన తరుణ్‌ను కాంగ్రెస్‌ కార్యకర్తలు కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకుపోయారు. గాయాలపాలైన అతడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హార్దిక్‌ పటేల్‌పై దాడి చేయడానికి గల కారణాలను మీడియాకు వివరించాడు. 

తరుణ్‌ గజ్జర్‌ సామాన్య పౌరుడని, అతడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సురేంద్రనగర్‌ ఎస్పీ మహేంద్ర బాఘేదియా తెలిపారు. చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: హార్దిక్‌ పటేల్‌ చెంప చెళ్లు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement