
ఇతడి చర్య కర్కశత్వానికి పరాకాష్ట
సాధారణంగా పసి పిల్లలు ఏడుస్తుంటే ఓదార్చాలని అనిపిస్తుంది. ఆడిస్తూ ముద్దుచేయాలనిపిస్తుంది. అదే ఆస్పత్రుల్లో పనిచేసే వార్డు బాయ్‌లకు ఇలాంటి ఆలోచన కాస్తంత ఎక్కువగా ఉండాలి.
డెహ్రాడూన్: సాధారణంగా పసి పిల్లలు ఏడుస్తుంటే ఓదార్చాలని అనిపిస్తుంది. ఆడిస్తూ ముద్దుచేయాలనిపిస్తుంది. అదే ఆస్పత్రుల్లో పనిచేసే వార్డు బాయ్‌లకు ఇలాంటి ఆలోచన కాస్తంత ఎక్కువగా ఉండాలి. కానీ, ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పట్టుమని మూడు రోజులు కూడా ఉండని పసి బాలుడిపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. ఏడుస్తుందనే కారణంతో ఆ బిడ్డ కాలు విరిచాడు. ఈ షాకింగ్ ఘటన ఆ ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. జనవరి 28న రూర్కీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శ్వాస సంబంధమైన సమస్యతో ఓ మూడు రోజుల పసిపాపను చేర్పించారు. పరిశీలనలో పెట్టారు.
అదే గదిలో వార్డు బాయ్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పాప ఏడ్వడం ప్రారంభించింది. సాధారణంగా పసిపిడ్డలు చేసే పని ఏడ్వడం.. వారికి ఏ సమస్య వచ్చినా ఏడుపుద్వారా మాత్రమే చేయగలరు. ఈ విషయం అర్థం చేసుకోకుండా కోపంతో ఆ బిడ్డ వద్దకు వెళ్లి డయాపర్ మార్చే క్రమంలో కోపంతో కాలు మెలేశాడు. దీంతో అది కాస్త విరిగింది. పాప ఏడ్వడం మరింత ఎక్కువైనా అతడు మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. అనంతరం అక్కడికి వచ్చిన వైద్యులు పాప కాలు దెబ్బతినడం చూసి కారణాలు సీసీటీవీలో పరిశీలించి అవాక్కయ్యారు. అతడిని పోలీసులకు పట్టించారు.