ఇద్దరిలో ఒకడు దొరికాడు | Handwara molestation case: One of the two accused arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరిలో ఒకడు దొరికాడు

Apr 19 2016 11:35 AM | Updated on Sep 3 2017 10:16 PM

ఇద్దరిలో ఒకడు దొరికాడు

ఇద్దరిలో ఒకడు దొరికాడు

హంద్వారా పట్టణంలో 16 ఏళ్ల బాలికపై వేధింపులకు తెగబడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.

హంద్వారా: జమ్మూకశ్మీర్ లోని హంద్వారా పట్టణంలో 16 ఏళ్ల బాలికపై వేధింపులకు తెగబడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితుడిని హిలాల్ అహ్మద్ బాండేగా గుర్తించారు. అతడిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న పాఠశాల నుంచి తన స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు దుండగులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధిత బాలిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు తెలిపింది. తన బ్యాగు కూడా లాక్కుపోయారని వెల్లడించింది. తనపట్ల సైనికులు అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది.

కాగా, బాలికను సైనికులు వేధించారన్న వందతులు వ్యాపించడంతో స్థానికులు భద్రతా దళాలపై రాళ్లతో దాడి చేశారు. ఆర్మీ బంకర్ ను ధ్వంసం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా స్పందించి చర్యలు చేపట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement